ఆపదలో ఉన్న సాటి మనుషులకు ఆపన్న హస్తం అందించడమే మానవత్వమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లారావులపాలెంలో గురువారం విజయవాడ వరద బాధితులకు నిత్యవసర వస్తువులను పంపించారు. 10 టన్నుల బియ్యం, 7 టన్నులు కూరగాయలు, పదివేల వాటర్ బాటిల్స్, 20వేల వాటర్ ప్యాకెట్లు, 2వేల పాల ప్యాకెట్ ప్యాకెట్లతో కూడిన సుమారు
రూ. 10 లక్షల విలువ చేసే నిత్యావసర సరుకులను పంపించారు.