ప్రమాదంలో గాయపడిన మిత్రుడికి తోటి జనసైనికులు అండగా నిలిచి ఆర్థిక భరోసాను ఇవ్వడం అభినందనీయమని జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ అన్నారు. కోనసీమ జిల్లా రావులపాలెం కొత్త కాలనీకి చెందిన బంగారు జాన్సన్ ( జాను) ఇటీవల బైక్ ఏక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డాడు. రావుల పాలెంకి చెందిన అంబటి కిషోర్ పలు సామాజిక మద్యమాల ద్వారా సేకరించిన లక్ష రూపాయలను శ్రీనివాసరావు చేతుల మీదుగా ఆదివారం అందజేశారు.