సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న అన్ని భాగాల ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గాంధీ విగ్రహానికి బుధవారం వినతి పత్రం సమర్పించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ప్రభుత్వ హైస్కూల్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహంవద్ద కొద్దిసేపు నిరసన వ్యక్తం చేసి అనంతరం వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ధనరాజు, మూర్తి, ప్రకాష్, బాలు, జీవి, స్వామి, కృష్ణ ప్రసాద్, చంద్రశేఖర్ పాల్గొన్నారు