నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులపై సంబంధిత శాఖ అధికారులతో కొత్తపేట ఎమ్మెల్యేబండారు సత్యానందరావు సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కొత్తపేట, ఆలమూరు, రావులపాలెం, ఆత్రేయపురం మండలాల అభివృద్ధి అధికారులు, పంచాయితీ రాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరిగతిన అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు.