అదనపు కట్నం వేధింపుల పై బుధవారం కేసు నమోదు చేసినట్టు కొవ్వూరు రూరల్ ఏఎస్సై జె. ధర్మరాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం నిడదవోలుకు చెందిన ప్రసాద్ కి పశివేదల గ్రామానికి చెందిన గంగారత్నం కు వివాహం జరిగింది. ఇటీవల తరచూ అదనపు కట్నం తీసుకు రమ్మని భర్త, అతని తల్లిదండ్రులు, మరిది వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆమె రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసామని వివరించారు.