మండపేటలో కనువిందు చేసిన సూర్యోదయం

79చూసినవారు
మండపేటలో కనువిందు చేసిన సూర్యోదయం
మంచు తెరలను చీల్చుకుంటూ పంట క్షేత్రాల్లో ఎర్రటి కుంకుమ దిద్దినట్టుగా మండపేటలో సూర్యోదయం కనువిందు చేసింది. లేలేత కిరణాలతో అప్పుడే లేచిన పసికూన మాదిరి పై పైకి లేస్తున్న దినకరుడి సుందర రూపాన్ని ఆస్వాదిస్తూ రైతులు తమ పంట పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అర్బన్, రూరల్ ఏరియాల్లో పలుచోట్ల దమ్ములు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతన్న చేలకు నీరు ఎక్కించి దమ్ములతో పాటు కొన్నిచోట్ల ఆకుమడులు పోశారు.

సంబంధిత పోస్ట్