2024 జులై 18 నుండి ఆగస్టు 5 వరకు జరిగిన జనసేనపార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ మండపేట నియోజకవర్గ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా బుధవారం మండపేటలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు నియోజకవర్గంలో మొత్తం 12, 777 మంది సభ్యత్వం నమోదు చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వారికి ఏ కష్టం వచ్చిన జనసేనపార్టీ అండగా ఉంటుందనన్నారు.