మండపేట బురుగుంట చెరువు వైఎస్సార్ పార్కులో 23 సిమెంటు బెంచీలను లయన్స్ క్లబ్ సభ్యులు, దాతల సహకారంతో శనివారం పార్కుకు బెంచీలు సమకూరాయి. డొక్కా సీతమ్మ వాకర్స్ క్లబ్ అద్యక్షుడు కోన సత్యనారాయణ ఆధ్వర్యంలో వాటిని ప్రారంభించారు. పార్కుకు గడియారం, వేయింగ్ మిషన్ గుంటూరు సత్యనారాయణ బహుకరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ డిఈ కే శ్రీనివాస్ దాతలు అందించిన సహకారానికి అభినందనలు తెలిపారు.