కాట్రేనికోన మండలంలోని చెయ్యేరు అగ్రహారం గ్రామంలో హరిబాబు అనే గ్రామస్థుడికి చెందిన ఇంటిలో శుక్రవారం ఓ తాచు పాము హల్చల్ చేసింది. ఈ మేరకు స్థానిక గ్రామస్థులు స్నేక్ క్యాచర్ జంపన గణేష్ వర్మకు సమాచారం అందించడంతో ఆయన చేరుకొని పామును చాకచక్యంగా డబ్బాలో బంధించారు. జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతాలలో పామును విడిచిపెడతామని గణేష్ వర్మ తెలిపారు.