కాట్రేనికోన మండలం వాటర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ గా ఆకాశం శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం తాహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల్లో నామినేషన్లు పడకపోవడంతో ఎన్నికల అధికారి సునీల్ కుమార్ శ్రీనివాసును ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. వైస్ ఛైర్మన్ గా వాసంశెట్టి రాజేశ్వరరావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలువురు పూలమాలలతో సత్కరించారు.