
మామిడికుదురు: మేధావుల వేదిక అధ్యక్షుడిగా హుస్సేన్
మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన హుస్సేన్ను వైసీపీ కోనసీమ జిల్లా స్థాయి మేధావుల వేదిక విభాగం అధ్యక్షుడిగా నియమించారు. వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం నుంచి తనకు ఆదేశాలు వచ్చాయని హుస్సేన్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా అతడిని పలువురు అభినందించారు.