రానున్న రెండేళ్లలో పెద్దాపురం నియోజకవర్గాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సామర్లకోటలో విలేకరులతో మాట్లాడుతూ పశువులమ్మ గుడి వద్ద నుంచి ఏలేరు కాలువ, రైల్వే ట్రాక్ మీదుగా రూ. 100 కోట్ల రైల్వే నిధులతో ఆర్‌ఓబీ నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు.