రేపు కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన

53చూసినవారు
రేపు కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం కాకినాడ జిల్లాలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాయి. ఉదయం 8: 30 నిమిషాలకు మాదాపూర్ లోని ఆయన నివాసం నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి 9గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 9: 45కి రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 9: 50కి రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి కాకినాడ కలెక్టరేట్ లో అధికారులతో సమీక్షలో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్