గొల్లప్రోలు మండలంలోని వివిధ గ్రామాల్లో కోడిపందేలు, గుండాట ఆడుతున్న బృందాలపై దాడి చేసి 20 మందిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. పిఠాపురం సీఐ శ్రీనివాస్, సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు. జనవరి 13 నుంచి బుధవారం వరకు దాడులు నిర్వహించినట్లు సీఐ చెప్పారు. జూదాలకు సంబంధించి 10 కేసులు నమోదు చేసి రూ. 13 వేలు, కోడి పుంజులు, గుండాట సామగ్రి స్వాధీనం చేసుకున్నామని, వీరిని కోర్టులో హాజరు పరుస్తామన్నారు