రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం యథావిథిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టరేట్ అధికారులు ఆదివారం తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.