ప్రమాదకరంగా మారి అమాయకుల ప్రాణాలను తీస్తున్న క్వారీ గోతులను తక్షణమే పూడ్చివేయాలని లేనిపక్షంలో జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తామని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ ఛైర్మన్ బర్రె కొండబాబు హెచ్చరించారు. బుధవారం స్థానికులతో కలిసి రాజమండ్రిలోని క్వారీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికారులు గోతులను తక్షణమే పూడ్చాలంటూ డిమాండ్ చేశారు.