వాతావరణ మార్పుల నేపథ్యంలో రాజోలు మండలంలో మంగళవారం నుంచి ఆకాశం మేఘాలు మబ్బులు అలుముకుని గాలులు వీస్తూ చిరుజల్లు కురుస్తున్నాయి. దీంతో సార్వ పంట ఓబ్బిడి చేసుకుంటున్న రైతులలో ఆందోళన నెలకొంది. రాజోలు మండలంలో ఇప్పటివరకు 60 శాతం మాత్రమే వరి కోతలు పూర్తయ్యాయి. మిగిలిన రైతులు పంట ఓబ్బిన చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యా రు. ధాన్యం రాశులపై బరకాలు కప్పి తడవకుండా జాగ్రత్త పడుతున్నారు.