రాజోలు మండలం శివకోటి గ్రామ దేవతలైన శ్రీకటికలమ్మ మారమ్మ తల్లి జాతర మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గరగ నృత్యాలు, మేళతాళాలు నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.