పట్టభద్రులు అందరూ ఓటు నమోదు చేయించుకోవాలని రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం సఖినేటిపల్లిలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 6తో ముగియనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటును ప్రతి ఒక్కరూ బాధ్యతతో నమోదు చేయించుకోవాలన్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు మళ్లీ తమ ఓటును తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలన్నారు.