తుని అవోపా సంస్థ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య విద్యార్థులకు స్కాలర్షిప్ , వృద్ధులకు వాకింగ్ స్టిక్స్ పంపిణీ చేశారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కుసుమంచి సుబ్బరాయులు చేతులు మీదగా శుక్రవారం అందజేశారు. వాసవి చారిటబుల్ ట్రస్ట్లో ఉచిత యోగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కడిమిశెట్టి సూర్యప్రకాష్, వాసవి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కుసుమంచి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.