వరద బాధితులకు అండగా నిలిచిన నియోజకవర్గ విద్యా కుటుంబ సహాయం ఒక మోడల్ ప్రాజెక్టుగా నిలిచిందని ఎమ్మెల్సీ కెఎస్. లక్ష్మణరావు అన్నారు. శుక్రవారం రాత్రి అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలులంకలో నియోజకవర్గ విద్యా కుటుంబం ఆధ్వర్యంలో 460 వరద బాధిత కుటుంబాల వారికి కుక్కర్లు, వంట సామాగ్రి సహాయంగా అందించే కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్సీ మాట్లాడుతూ 30 లక్షల నగదు సేకరించడం అభినందనీయమన్నారు.