జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రముఖ సినీ నటుడు కొణిదెల నాగబాబు రాష్ట్ర మంత్రివర్గంలో చేరనుండటం శుభ పరిణామం అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం అవనిగడ్డలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతానికి అనునిత్యం అధినేత పవన్ కళ్యాణ్ వెంట ఉంటూ శ్రమించిన నాగబాబుకు కూటమి ప్రభుత్వంలో సముచిత గుర్తింపు, గౌరవం దక్కటం సంతోషదాయకం అన్నారు.