ఆముదార్లంక కు లాంచీల ద్వారా ఆహారం

67చూసినవారు
ఆముదార్లంక కు లాంచీల ద్వారా ఆహారం
గుంటూరు జిల్లాలో అంతర్భాగంగా ఉండే చల్లపల్లి మండలం ఆముదార్లంక గ్రామానికి అధికారులు బుధవారం లాంచీల ద్వారా భోజనం తీసుకువెళ్లి గ్రామంలోని వరద బాధితులకు అందచేశారు. సుమారు 750 మందికి భోజనం ప్యాకెట్లు, వాటర్ టిన్లు, మంచినీటి ప్యాకెట్లు తీసుకువెళ్లారు. తహసీల్దార్ డి. వనజాక్షి ఆధ్వర్యంలో ఇన్ఛార్జి డీటీ కృష్ణమోహన్, ఏపీవో రామ్మోహన్ తోపాటు అధికారుల బృందం సహాయక కార్యక్రమంలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్