ఎస్సీ వర్గీకరణతోనే మాదిగల జీవితాల్లో వెలుగులు వస్తాయని పలువురు వక్తలు అన్నారు. గురువారం రాత్రి ఘంటసాల పెద్దగూడెంలో అమ్మనాన్న ట్రస్టు అధ్యక్షులు కొడాలి భక్తపాల్, పెద్దగూడెం యూత్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తూ విజయోత్సవ కార్యక్రమాన్ని జరిపారు. ఈ సందర్భంగా పెద్దగూడెంలో మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.