గన్నవరం: పోలీసుల అదుపులో మరో ఆరుగురు నిందితులు

68చూసినవారు
గన్నవరం: పోలీసుల అదుపులో మరో ఆరుగురు నిందితులు
గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి కేసులో మరో ఆరుగురు నిందితులను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో 17 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం 89 మందిని నిందితులుగా పోలీసులు చేర్చారు ఇదే కేసులో 71వ నిందితునిగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కూడా ఉన్నారు. ఈ కేసులో నిందితులగా ఉన్న పలువురు ఇప్పటికీ పరారీలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్