గన్నవరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ అనుచరులు తొమ్మిది మందిని శుక్రవారం గన్నవరం పోలీసులు సిఐడి కార్యాలయానికి తరలించారు. గతంలో గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిలో పాల్గొన్నటువంటి వల్లభనేని వంశీ అనుచరుల్లో 11 నందిని శుక్రవారం తెల్లవారుజామున గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకొని వారిలో తొమ్మిది మందిని గట్టి పోలీసు బందోబస్తు మధ్య మంగళగిరిలోని సిఐడి కార్యాలయానికి తరలించారు.