బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే

67చూసినవారు
బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే
వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని.. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. బాపులపాడు మండలం రామన్న గూడెంలోనీ జడ్పీహెచ్ హైస్కూల్లో సోమవారం వరద బాధితులకు నిత్యవసరాలను ఎమ్మెల్యే యార్లగడ్డ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ.. వరద ప్రాంతాల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరిని కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్