ఉచిత కరెంటు అంతా మోసం అని జగ్గయ్యపేట నియోజకవర్గం వైసిపి ఇన్ చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆరోపించారు. ఆదివారం జగ్గయ్యపేట పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 9 గంటల ఉచిత విద్యుత్ ఒక గంట తగ్గించి 8 గంటలకు కుదించి మరలా ఒక గంట తగ్గించి 7 గంటలు మాత్రమే ఇస్తూ ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు చెప్పిన కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు.