జగ్గయ్యపేట: పసికందు ప్రాణాలు కాపాడిన ప్రజా దర్బార్
జగ్గయ్యపేటలోని చదల మహేష్ భార్య లక్ష్మి మగ శిశువును ప్రసవించింది. బిడ్డ ఏడుస్తూ పాలు తాగకపోవడం వల్ల పట్టణంలో హాస్పిటల్ కు తీసుకెళ్లగా బిడ్డకు రక్త కణాలు పడిపోయాయని సూచించారు. ప్రజాదర్బార్లో మంత్రి నారా లోకేష్ ను ఆశ్రయించగా ఎంత ఖర్చైనా చికిత్స చేయించమని కలెక్టర్కు, పిఎస్ కు ఆదేశాలు జారీ చేశారు. బిడ్డ ఆరోగ్యం పరిస్థితి బాగుందని తల్లిదండ్రులు తెలియజేశారు. లోకేష్ కు తమ కుటుంబం రుణపడి ఉంటుందని శనివారం తెలిపారు.