మచిలీపట్నం: జగన్ ప్రజలు నిన్ను అడ్రస్ లేకుండా చేస్తారు
జమిలి ఎన్నికలు కోసం ఆశ పడుతున్నాడేమో జగన్ ఏ ఎన్నికలకైనా ప్రజలు నిన్ను అడ్రస్ లేకుండా చేస్తారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ 2027 జమిలి ఎన్నికలకు సిద్ధానికి చర్యలు చేపట్టారన్నారు. కానీ నియోజకవర్గాలు పునర్వ్యవస్థీకరణ, సెన్సెస్ లాంటి కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన అవసరం ఉందన్నారు. జమిలి ఎలక్షన్లకు మేము సిద్ధమేనని స్పష్టం చేశారు.