పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం మచిలీపట్నం 48 డివిజన్ సంబంధించిన పుప్పాల సూరిబాబు లివర్ మార్పిడి గానూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 10 లక్షల నగదు చెక్కును మంత్రి బాధితునికి అందజేశారు. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ప్రజలందరి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు.