మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెంలో కోడిపందాలపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఎనిమిది మంది వ్యక్తులను అరెస్ట్ చేసినట్లుగా రెడ్డి గూడెం ఎస్సై మోహన్ రావు తెలిపారు. రూ.6, 500 నగదు, ఐదు పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లుగా ఎస్ఐ వివరించారు. పేకాట, కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ హెచ్చరించారు.