మోపిదేవి: సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

72చూసినవారు
మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో దేవస్థానానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి నాగ పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. నాగవల్లి వృక్షానికి ముడుపులు కట్టి తాము కోరిన కోరికలు తీర్చాలని వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్