పెడన పట్టణంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన ఉపేక్షించేది లేదని బందరు రూరల్ డీఎస్పీ సుభాన్ ఖాన్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, మేళ తాళాల మధ్యనే అమ్మవారి ఊరేగింపులు నిర్వహించాలని పట్టణ వాసులకు సూచించారు. సిడిబళ్ల నిర్వాహణలో డీజేలకు అనుమతులు లేవని, అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.