తిరువూరు: ఆహార నియమాలపై అవగాహన కార్యక్రమం

61చూసినవారు
తిరువూరు: ఆహార నియమాలపై అవగాహన కార్యక్రమం
తిరువూరు పట్టణంలోని మధుమేహ చికిత్స కేంద్రంలో ఆదివారం డాక్టర్ వల్లభనేని రవీంద్ర పర్యవేక్షణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సత్య తేజ హాజరై మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహార నియమాలలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిస్తూ ఆహారం క్రమ పద్ధతిలో తీసుకోవడం వలన మధుమేహ వ్యాధి వలన వచ్చే ప్రధాన వ్యాధులు రాకుండా ఉంటాయని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్