పాఠశాలల్లోని సమస్యలతోపాటు విద్యార్థుల ఇబ్బందులు తెలుసుకొని వారిని చదువుతోపాటు ఆటపాటల్లో ముందు ఉంచేందుకు కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులు తల్లిదండ్రులు దాతలతో ఈ మెగా సమావేశాలను నిర్వహిస్తుందని, మాజీ మంత్రి శ్రీదేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. శనివారం విజయవాడ రూరల్ మండలం పైడూరిపాడు గ్రామంలోని ఎంపీయుపీ స్కూల్లో ఏర్పాటు చేసిన పేరెంట్స్ మీటింగ్ లో దేవినేని ఉమా పాల్గొన్నారు.