ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నూతన సంవత్సర సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని బుధవారం తమ నివాసంలో డిజిపి ద్వారకా తిరుమలరావు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇరువురు కొంత సమయం ముచ్చటించుకున్నారు. పోలీసులు చేస్తున్న సేవలకు గాను, పోలీస్ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఎక్కడ కూడా నూతన సంవత్సరంలో ఎటువంటి అసాంఘిక సంఘటనలు చోటు చేసుకోకుండా విధులు నిర్వహించారని అన్నారు.