విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బుడమేరు వంతెన వద్ద యాంటీ లార్వా ఆపరేషన్ పనులను శుక్రవారం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తో ఎంపీ కేశినేని శివనాథ్ పరిశీలించారు. ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గత రెండు నెలలుగా దోమల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. దానిలో భాగం గా విజయవాడ పరిధిలో దోమల లార్వా నివారించేందుకు డ్రోన్స్ ద్వారా కెమికల్స్ స్ప్రేయింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు.