విజయవాడలో వర్షం

57చూసినవారు
విజయవాడలో ఆదివారం ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణంలోని మార్పులు నెలకొన్నాయి. విపరీతమైన ఎండ ఉండగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం కురిసింది. అప్పటివరకు ఎండ తాపానికి గురైన వాహనదారులు పాదచారులు, వర్షం కురవడంతో కొంత సేద తీర్చుకున్నారు. ఆగకుండా కురిసిన గంట పాటు వర్షానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గంటపాటు వర్షానికి విజయవాడలోని పలు రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి.

సంబంధిత పోస్ట్