ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, రైస్ మిల్లర్లు ధాన్యాన్ని త్వరగా దించుకోవాలని ప్రభుత్వం ప్రతి గింజ కొనుగోలు చేస్తుందని రైతులు ఆధైర్య పడవద్దని కోడూరు మండల కూటమి నేతలు అన్నారు. సోమవారం కోడూరు రైతు భరోసా కేంద్రం వద్ద అధికారులను అడిగి ధాన్యం కొనుగోలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ నేపధ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటించి రైతులకు గోనె సంచులు వెంటనే అందించి ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు.