మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని మంత్రి కొల్లు రవీంద్ర శనివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారి నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీరామ వర ప్రసాదరావు మంత్రిని సన్మానించి, స్వామివారి చిత్రపటం బహుకరించారు. ఆయన వెంట కూటమి నాయకులు ఉన్నారు.