బాపులపాడు మండలంలోని బండారుగూడెం గ్రామంలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సర్పంచ్ వడ్లమూడి అమ్మాజీ జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకుడు బర్రె లెనిన్, ఎంపీటీసీ పరిమి మౌనిక, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ చీలి ప్రసన్న తదితరులు ఉన్నారు.