మచిలీపట్నంలో కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఎస్సీ, ఎస్టీ, బీసీ-సీ అభ్యర్థుల చీఫ్ మేనేజర్ల ప్రమోషన్ల అంశంలో జరిగిన అన్యాయంపై చేస్తున్న ధర్నాకు ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు శుక్రవారం సంఘీభావం తెలిపారు. ధర్నా కార్యక్రమంలో పాల్గొని, బాధిత అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. సమస్య పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.