గుడివాడ: రైల్వే ట్రాక్ వద్ద రోడ్డుకు మరమ్మత్తులు

52చూసినవారు
గుడివాడ పట్టణం భీమవరం రైల్వే గేట్ వద్ద రోడ్డుపై గుంతలు ఏర్పడటంతో జాతీయ రహదారుల శాఖ అధికారులు శుక్రవారం రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టారు. నిత్యం వేల మంది ఈ రోడ్డులో ప్రయాణిస్తుండడంతో ట్రాక్ మధ్యలో రోడ్డుకు గుంతలు ఏర్పడి ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. సమస్యని గుర్తించి రోడ్డుకు మరమ్మతులు చేపడుతున్న జాతీయ రహదారుల శాఖ అధికారుల పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్