నిత్యావసర వస్తువులను అందుచేత

2431చూసినవారు
నిత్యావసర వస్తువులను అందుచేత
జగ్గయ్యపేట పట్టణంలోని వాసవీ సేవా సమితి, వాసవి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేద ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన గేల్లి సుమన్ కుమార్ దంపతులకు నిత్యవసర వస్తువులను వాసవి సేవా సమితి ప్రతినిధి కాకరపర్తి సోమేశ్వర రావు చేతులమీదుగా అందజేశారు. గుంటూరు జిల్లా అమరావతి చెందిన ఆర్య వైశ్య ప్రముఖులు కీర్తిశేషులు వంగేటి సాంబమూర్తి ధర్మపత్ని లీలావతి పుణ్యతిథి సందర్భంగా వారి కుమారులు వంగెటి శివ ప్రసాద్, కృష్ణారావు మల్లేశ్వరరావు ఉమామహేశ్వరరావు సౌజన్యంతో ఏర్పాటు చేసినట్టు వాసవి సేవా సమితి ప్రతినిధి కాకరపర్తి సోమేశ్వర రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో 21 వార్డ కౌన్సిలర్ గెల్లా వైకుంఠస్వరరావు, సంధ్యారాణి, వాసవి కపుల్స్ క్లబ్ అధ్యక్షులు కర్లపాటి వెంకటేశ్వరు, ఉపాధ్యక్షులు గోనుగుంట్ల ధనుంజయ, మెరిశెట్టి అంజనేయలు, వాసవి కపుల్స్ క్లబ్ జోన్ చైర్మన్ కొత్త క్రష్ణా రావు, కొప్పు సత్యనారాయణ(బిజెపి), తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్