ప్రతి ఇంటికి మంచినీటి సదుపాయం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య తెలిపారు. జగ్గయ్యపేట పట్టణంలోని స్థానిక విలియంపేటలో ఆదివారం మున్సిపల్ చైర్మన్ శ్రీరంగాపురం రాఘవేంద్రతో కలిసి విలియంపేటలో పర్యటించారు. మంచినీటి సదుపాయం సరిగా రావట్లేదని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం ప్రతి ఇంటికి వెళ్లి వారి యొక్క ఇబ్బందిని అడిగి తెలుసుకోవడం జరిగింది.