జగ్గయ్యపేట నియోజకవర్గం పోచంపల్లి గ్రామంలో 14.5 లక్షల వ్యయంతో సహకార సంఘం నూతన భవనం, క్యాష్ కౌంటర్, స్టాంగ్ రూమ్ ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. సంపూర్ణ సహకారంతో సహకార సంఘాలు అందరికి ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రజల సౌకర్యార్థం కోసం సహకార సంఘాలు అత్యాధునిక టెక్నాలజీతో ముందుకు సాగుతుందని,సహకార సంఘాల నుంచి సభ్యులు నగదును అప్పుగా తీసుకుని ఆ మొత్తాన్ని సద్వినియోగం చేసుకుని, సొంత కాళ్లపై నిలబడగలిగేలా ఈ సహకార సంఘాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని, సహకార సంఘాలు గిడ్డంగి సౌకర్యాలను కల్పిస్తున్నందు వల్ల గిట్టుబాటు ధర లభించే వరకు రైతులు తమ ఉత్పత్తులను నిల్వచేసుకోవచ్చునని, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి అంతిమ కొనుగోలుదార్లతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడుతాయని తెలియజేశారు.
పోచంపల్లి గ్రామం లో 14.5 లక్షల వ్యయంతో సహకార సంఘ భవనాన్ని నిర్మించడం జరిగిందని రైతులు, డ్వాక్రా సభ్యులు,అందరూ కూడా సహకార సంఘాల సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. తదనంతరం రైతులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కెడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, డైరెక్టర్ కొమ్మినేని రవిశంకర్, సర్పంచ్ బూతుకురి లక్ష్మీ, సభాధ్యక్షులు బూతుకురి మల్లేశ్వర్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు తిప్పిరెడ్డి ఓం శివరెడ్డి, బాల సైదా, చింతకుంట్ల వెంకట్ రెడ్డి, గ్రామ ముఖ్యనాయకులు, తదితరులు పాల్గొన్నారు.