ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో గురువారం జరగనున్న జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పాల్గొననున్నారు. ఈ మేరకు బుధవారం క్యాంపు కార్యాలయవర్గ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్ చార్జ్ నాదెండ్ల మనోహర్ హాజరవుతారని పేర్కొన్నారు.