కృష్ణా జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వరి సాగు 5, 690 హెక్టార్లలో పెరిగింది. గత ఖరీఫ్ సీజన్లో 1, 41, 634 హెక్టార్లలో జిల్లా రైతులు వరిసాగు చేపట్టారు. ఈ ఏడాది 1, 47, 324 హెక్టార్లలో వరి సాగవుతున్నట్లు ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది. ఇటీవల వచ్చిన వరదలతో నష్టపోయిన రైతులకు సకాలంలో ప్రభుత్వం పరిహారం ఇవ్వడంతో అన్నదాతలు గత నెలలో వరి నాట్లు వేశారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.