మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని హాస్పిటల్ నందు క్లినికల్ పోస్టింగ్స్ కు మెడికల్ స్టూడెంట్స్ బుధవారం వచ్చారు. రోగులకు మరింత వైద్యకు సేవలు అందుబాటులోకి వస్తాయని వైద్యులు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో మచిలీపట్నంలో మెడికల్ కళాశాల ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందించనున్నారు.